News July 20, 2024
కడప: ఇకపై ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్

కడప జిల్లాలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలపై 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT
Similar News
News November 27, 2025
కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
News November 27, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


