News June 3, 2024

కడప: ఇద్దరి మద్య గొడవ.. పక్కనున్న మహిళకు గాయాలు

image

నందలూరు మండల పరిధిలోని చింతలకుంటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని విడిపించడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు రాయి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలింది. హుటాహుటిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

మైదుకూరు: గౌడౌన్‌లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్‌పై అనుమానాలు

image

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

News November 23, 2025

ప్రొద్దుటూరులో అప్పులోళ్ల ఆందోళన..!

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు. తమ డబ్బులు కూడా పోలీసులే వసూలు చేయించాలని కోరుతున్నారు.

News November 23, 2025

కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

image

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.