News September 16, 2024
కడప: ‘ఇసుక పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయాలి’
ఇసుక పంపిణీ నియమ నిబంధనలో మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్‌వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News October 13, 2024
కడప: దసరా వేడుకల్లో అపశ్రుతి.. గాయపడిన వ్యక్తి మృతి
కడప నగరంలో దసరా వేడుకలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని బెల్లం బండి వీధిలో దసరా ఊరేగింపులో దురదృష్టవశాత్తూ పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఈ కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మరణించింది. మిగతా వారు చికిత్స పొందుతున్నారు.
News October 12, 2024
నేడు కడప – అరక్కోణం రైలు రద్దు
చెన్నై సమీపంలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ళను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్ళను రద్దు చేశారు. అందులో భాగంగా కడప నుంచి అరక్కోణం వెళ్ళే రైలు నం 06402 నేడు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
News October 12, 2024
దసరా వేడుకలకు కడప జిల్లాలో భారీ బందోబస్తు
కడప జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. దసరా వేడుకలకు రెండవ మైసూర్‌గా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరుతోపాటు కడపలో శమీ దర్శనం, ఉత్సవాలకు తలమానికం. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి తొట్టి మెరవని ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేశామన్నారు.