News April 9, 2024

కడప: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

కడప జిల్లాలో ఉగాది రోజు విషాదం నెలకొంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈతకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. కడపకు చెందిన డేవిడ్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆనకట్ట వద్దకు వచ్చాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మృతదేహాన్ని వెలికి తీశారు. వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News December 5, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00

News December 5, 2025

కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

image

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్‌తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.