News November 27, 2024
కడప: ఈ ఇద్దరికీ జీవిత సాఫల్య పురస్కారం

ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవిలకు గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. వైవీయూ వీసీ కె కృష్ణారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. వైవీయూలో జరిగిన గజ్జల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కార ఎంపిక కమిటీ సమావేశాన్ని వైవీయూలో నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాత్రికేయులుగా ఖ్యాతి పొందారని తెలిపారు.
Similar News
News March 16, 2026
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.

YVUలో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

YVUలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 19వ తేదీ లోపు APPGCET -2026కు
దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అడ్మీషన్స్ డైరెక్టర్ డా. లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ పూర్తయిన వారు, చివరి సెమిస్టర్ పరీక్షలు రాయబోయే వారు https://cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించాలన్నారు.