News June 11, 2024
కడప ఉక్కు కల సాకారమయ్యేనా?

కడప జిల్లాలో 20 ఏళ్లుగా ఒక కలలా ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఈ సారి పూర్తి అవుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. అందులోనూ అతను బీజేపీ ఎంపీ కావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఉండటంతో కడప ఉక్కు పరిశ్రమ సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
Similar News
News November 20, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.
News November 20, 2025
నేడు ఎర్రగుంట్ల RTPPకి అసెంబ్లీ కమిటీ.!

నేడు ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)ను రాష్ట్ర అసెంబ్లీ కమిటీ సభ్యులు సందర్శిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో 12 మంది కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లనున్నారు. RTPPలో విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, బొగ్గు కొరత తదితర అంశాలపై కమిటీ పరిశీలించనుంది. కాగా RTPP అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News November 20, 2025
కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.


