News October 14, 2024

కడప: ఉచితంగా డీఎస్సీ శిక్షణా కార్యక్రమం

image

కడప జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ కార్యక్రమం అందిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలియజేశారు. ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో అక్టోబర్ 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 25, 2025

పులివెందులలో YS జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. జన సందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ బాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ పులివెందులకు రావడంతో క్యాంప్ కార్యాలయం వద్ద జన సందడి నెలకొంది. ఆయనను జిల్లా నేతలు కలిశారు.

News November 25, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:

News November 25, 2025

ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

image

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.