News June 28, 2024

కడప: ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

బి.కోడూరు మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన మున్నెల్లి అనూష గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోరుమామిళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె వేసవి సెలవుల్లో వనిపెంటలోని పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News February 11, 2025

కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి

image

కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 11, 2025

కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అవినాశ్

image

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్‌ను కలిసి సమస్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రైలుకు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజు రైలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందుల యురేనియం ఫ్యాక్టరీ సమస్యలను విన్నవించారు.

News February 11, 2025

కొండాపురం: ఉదయాన్నే తప్పిన పెను ప్రమాదం

image

కొండాపురం మండలంలోని దత్తాపురం బస్టాప్ వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సు, ఐచర్ వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, గుజరాత్ నుంచి కడపకు వెళ్తున్న ఐచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

error: Content is protected !!