News December 6, 2024

కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!

image

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Similar News

News January 22, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,580
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,334
* వెండి 10 గ్రాముల ధర: రూ.3150.

News January 22, 2026

జమ్మలమడుగు: 100 ఏళ్ల క్రితం CSI క్యాంప్‌బెల్ ఆసుపత్రి ఫొటో చూశారా.!

image

జమ్మలమడుగు పట్టణంలోని CSI క్యాంప్‌బెల్ హాస్పిటల్ పురాతనమైనది. అయితే ఈ హాస్పిటల్ 1891వ సంవత్సరంలో జమ్మలమడుగులో నిర్మితమైంది వైద్య సేవల చరిత్రలో CSI క్యాంప్‌బెల్ ఆసుపత్రికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ దాదాపు 100 సంవత్సరాల నాటి ఫొటో బయటపడింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌కి సూపరింటెండెంట్‌‌గా డాక్టర్ అగస్టిన్ రాజ్ ఉన్నారు.

News January 22, 2026

ఒక్క ఫొటో… కడప అంటే మతాలకు అతీతం.! ❤️

image

కడప నగరంలో జరుగుతున్న శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారి పొడవున విచ్చేస్తున్న వందలాది మంది ప్రజలకు అన్న పానీయాలు అందజేస్తున్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలకు అన్నప్రసాదాలను అందిస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు. అప్సర సర్కిల్ సమీపంలోని ఓ కళాశాల వద్ద ముస్లిం విద్యార్థులు రాముని శోభాయాత్రలో భక్తులకు పానకం, వడపప్పు అందిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.