News October 4, 2024

కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు

image

వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.

Similar News

News December 3, 2025

కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

image

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్‌లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్‌లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.93.36 కోట్లు, అక్టోబర్‌లో రూ.93.44 కోట్లు, నవంబర్‌లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.

News December 3, 2025

కడప జిల్లాలో 60,411 హెక్టార్లలో పంటల సాగు.!

image

కడప జిల్లాలో రబీ పంట సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 60,411 హెక్టార్లలో(43.21%) పంటల సాగు జరిగింది. కేసీ కెనాల్ నీటి విడుదలపై స్పష్టత కరువై వరి 526 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి, గోధుమ, కొర్ర, రాగి, జొన్న తదితర ధాన్యం పంటలు 2,086 హెక్టార్లలో సాగు చేశారు. పప్పు దినుసులు 56,106 హెక్టార్లలో, నూనె గింజలు 1,654 హెక్టార్లలో, వాణిజ్య పంటలు 16 హెక్టార్లలో సాగయ్యాయి.

News December 3, 2025

దువ్వూరు: ఎర్రచందనం దొంగపై నాలుగోసారి PD యాక్ట్

image

దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన ఎర్రచందనం దొంగ ఇరుగంరెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై నాలుగోసారి పీడీ యాక్ట్ నమోదైనట్లు మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ యాదవ్ తెలిపారు. నాగ దస్తగిరి రెడ్డిపై ఇప్పటివరకు మొత్తం 128 కేసులు ఉన్నాయని అన్నారు. వీటిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 80, మరో 38 చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. ఈయన ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు.