News May 25, 2024

కడప: ఎన్నికల విధుల్లోకి మరికొంత మంది అధికారులు

image

ఎన్నికలకు అనుబంధంగా విధులు నిర్వహించడానికి కడప, అన్నమయ్య జిల్లాలలో మరికొంత మంది అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రైల్వేస్ డిఎస్పీ బి.మోహన్ రావు, సీఐడి డిఎస్పీ భాస్కర్ రావులను అన్నమయ్య జిల్లాలో నియమించారు. ఏసీపీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఏసీపీ డీఎస్పీ ఎన్ సత్యానందంలను కడప జిల్లాలో నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Similar News

News February 24, 2026

కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

image

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.

News February 24, 2026

వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.