News May 12, 2024
కడప: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

ఉమ్మడి కడప జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. బద్వేల్-76.3, రాజంపేట-74.1, కడప-62.8, కోడూరు-74.8, రాయచోటి-74.9, పులివెందుల-89.5, కమలాపురం-81.9, జమ్మలమడుగు-85.7, ప్రొద్దుటూరు-76.9, మైదుకూరు- 81.3. అలాగే ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో జమ్మలమడుగు, కడపలో 100%, మిగిలిన చోట్ల అంతా 90% పైగా ఓట్లు పోలయ్యాయి. అదే స్ఫూర్తితో ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News February 18, 2025
ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయాలి: ఎస్పీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.
News February 17, 2025
ఒంటిమిట్టకు చేరిన శ్రీవారి లడ్డూలు

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయానికి సోమవారం తిరుమల శ్రీవారి లడ్డూలు వచ్చాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన 1500 లడ్డులను సిబ్బంది ఆలయంలోనికి తీసుకువెళ్లారు. గతంలో రెండవ శనివారం, నాలుగవ శనివారం ఇచ్చే లడ్డూలు, గత కొన్ని నెలలుగా ప్రతిరోజు ఇస్తున్న విషయం తెలిసిందే.
News February 17, 2025
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: ఎస్పి

కడప జిల్లాలోని హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా ఎస్.పిఅశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు ఇతర సిబ్బందికి కడప జిల్లా పోలీస్ మైదానంలో రెండు వారాల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోం గార్డ్‌గా చేరకముందు తీసుకున్న శిక్షణను మరోసారి గుర్తు చేసుకుంటూ మొబలైజేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు.