News November 27, 2024
కడప ఎస్పీకి జేసీ లేఖ.. నేడు ఏం జరగనుంది?
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్ రెడ్డిని JC ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలింపు విషయంలో అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తెలిపారు. ఈమేరకు కడప ఎస్పీకి లేఖ రాశారు. నేటి నుంచి తమ వాహనాలు లోడింగ్‌కు వెళ్తాయని, ఆపితే తేలిగ్గా తీసుకోమని అన్నారు. 1932నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News December 13, 2024
అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ
అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
News December 13, 2024
పెనుకొండ బాబయ్య స్వామి చరిత్ర.. (1/1)
పెనుకొండ బాబయ్య స్వామి 752వ గంధం, ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా బాబా ఫకృద్దీన్ జన్మస్థలం ఇరాన్ దేశం. చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో గురువుల ఆదేశానుసారం ఇరాన్‌ను వీడుతారు. దేశాలన్నీ తిరుగుతూ తమిళనాడులోని తిరుచనాపల్లికి చేరతారు. అక్కడ సత్తేహార్ తబ్రే ఆలం బాద్‌షాను గురువుగా పొందుతారు. ఆయన వేపపుల్ల ఇచ్చి పెనుకొండకు వెళ్లమని బాబాను ఆదేశిస్తారట. <<14864905>>Cont’d..<<>>
News December 13, 2024
అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలు (1/2)
అలా <<14864840>>బాబా<<>> ఫకృద్దీన్ పెనుకొండ శివారులోని ఓ మంటపంలోకి చేరుకుంటారు. ప్రజలకు ప్రేమను పంచుతూ మతసామరస్యాన్ని వివరించేవారు. బాబయ్య స్వామిగా పేరొంది ప్రజలను ఆశీర్వదించేవారు. అయితే గురువు ఇచ్చిన వేపపుల్లను రోజూ తలకింద పెట్టుకుని నిద్రపోయేవారట. ఒక రోజు ఆ వేపపుల్ల చిగురించడంతో ఇదే తన నివాసమని భావిస్తారు. క్రీస్తుశకం 694లో పరమదించడంతో అక్కడే సమాధి చేశారు. అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.