News May 10, 2024
కడప ఎస్పీ హెచ్చరికలు జారీ

ఈ నెల 13న జరగబోయే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా, ఈవిఎం మిషన్లను తాకినా తాట తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు మూడంచెల భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ సిబ్బంది, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 1, 2025
నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి

దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సేనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు.
News October 31, 2025
రేపు కడపకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం కడపకు రానున్నారు. 2వ తేదీ కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే జానుమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడప చేరుకుని రాత్రికి బస చేసి 2న ఉదయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఆయన చెన్నైకు విమానంలో బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు.
News October 31, 2025
ఇంట్లో గోడ కూలి మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఇంట్లోని గోడ కూలి మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామం హరింద్రానగర్లో చోటుచేసుకుంది. కొట్లూరు శివమ్మ (52)ను గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ అత్త కొట్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


