News December 17, 2024

కడప: ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు సస్పెండ్

image

కడప నగరపాలక సంస్థలో <<14900085>>ఏడుగురు కార్పొరేటర్లు<<>>, నలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీలో చేరిన వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా డివిజన్లకు కొత్త ఇన్‌ఛార్జులను నియమిస్తామని ఆయన వెల్లడించారు.

Similar News

News February 27, 2026

బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 27, 2026

కడప: హిస్టరీ పేపర్-1 పరీక్షకు 89% మంది విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలో శుక్రవారం 43 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ హిస్టరీ పేపర్-1 పరీక్షలు జరిగాయి. 2,144 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,912 మంది 89% హాజరయ్యారు. 232 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 809 మందికి గాను.. 725 మంది పరీక్షలు రాశారు. 84 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,335 మందికి గాను.. 1,187 మంది హాజరవ్వగా, 148 మంది గైర్హాజరయ్యారు.2 చోట్ల మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు.

News February 27, 2026

ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

image

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.