News November 25, 2024
కడప: ఒక్కడే మిగిలాడు.. అనాథయ్యాడు

మైదుకూరు ఘాట్లో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాశినాయన(M) చిన్నాయపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి(45), అరుణ(37) కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఖాజీపేటలో 8వ తరగతి చదువుతూ తిప్పాయపల్లెలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. అతడిని చూసేందుకు కుమార్తె పవిత్ర(12)తో కలిసి దంపతులు బైకుపై బయల్దేరారు. ఘాట్ రోడ్డులో లారీని ఓవర్ టేక్ చేస్తూ కిందపడిపోయారు. వీరిపై నుంచి మరో లారీ వెళ్లడంతో ముగ్గరూ చనిపోయారు.
Similar News
News December 3, 2025
కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.
News December 3, 2025
శనగ పంటలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి: JDA

శనగ పంటలో పచ్చ పురుగు నివారణకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(JDA) చంద్ర నాయక్ రైతులకు సూచించారు. ప్రొద్దుటూరు మండలంలో సాగుచేసిన పప్పు శనగ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. పచ్చ పురుగులను పక్షులు ఏరుకొని తింటాయన్నారు. ఖర్చు తగ్గుతుందన్నారు. వేప నూనె, ట్రైకోడెర్మా విరిడి పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ADA అనిత, MAO వరహరికుమార్, టెక్నికల్ AO సుస్మిత పాల్గొన్నారు.
News December 3, 2025
కడప రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?

కడప రిమ్స్లో అందే సేవల విషయంలో పేషెంట్లు, వారి వెంట వెళ్లే కుటుంబసభ్యులు నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కుటుంబీకులు చేతుల మీద ఎత్తుకెళ్లారు. అలాగే పేషెంట్లను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్లను చెత్తను తరలించడానికి సిబ్బంది ఉపయోగించిన ఫొటోలు కూడా బయటికి రావడంతో విమర్శలు వస్తున్నాయి. అక్కడి సేవలు, మీరు ఎదుర్కొన్న సమస్యలను కామెంట్ చేయండి.


