News November 25, 2024

కడప: ఒక్కడే మిగిలాడు.. అనాథయ్యాడు

image

మైదుకూరు ఘాట్‌లో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాశినాయన(M) చిన్నాయపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి(45), అరుణ(37) కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఖాజీపేటలో 8వ తరగతి చదువుతూ తిప్పాయపల్లెలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. అతడిని చూసేందుకు కుమార్తె పవిత్ర(12)తో కలిసి దంపతులు బైకుపై బయల్దేరారు. ఘాట్ రోడ్డులో లారీని ఓవర్ టేక్ చేస్తూ కిందపడిపోయారు. వీరిపై నుంచి మరో లారీ వెళ్లడంతో ముగ్గరూ చనిపోయారు.

Similar News

News December 10, 2024

బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ

image

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా, రాయచోటి, మదనపల్లి, రాజంపేట, సబ్ డివిజన్ ప్రాంతాలలో రైస్ మిల్లులు, గోడౌన్లపై, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, పోలీసులకు స్పెషల్ టీంల సహకారంతో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

News December 10, 2024

14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు

image

వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.

News December 9, 2024

రాయచోటిలో టీచర్‌ మృతి.. విద్యార్థుల అరెస్ట్

image

రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ZPHSలో ఉపాధ్యాయుడు అహ్మద్‌(42) మృతి కేసులో ఇద్దరు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై  టీచర్‌పై దాడి చేసినట్లు సమాచారం.