News August 29, 2024
కడప: కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

ఖాజీపేట మండలం అప్పనపల్లికి చెందిన ప్రవీణ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలికిరిలోని JNTUలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ ర్యాగింగ్‌కు గురయ్యాడు. మనస్థాపన చెంది ఈనెల 23న ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన బాధను ఇంట్లో చెప్పుకోలేక 26న పురుగు మందును తాగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందుతుండగా ఇవాళ ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News February 10, 2025
సమస్యలు ఉంటే అర్జీలతో రండి: కడప కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆహారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నారు.
News February 9, 2025
కడపలో పాఠశాల విద్యార్థి ఆత్మహత్య

కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల నారాయణ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కొప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
News February 9, 2025
కడప: 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్‌తో మీరు కలిశారా?.