News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్‌గా అదితి సింగ్

కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్‌గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్‌ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
Similar News
News November 5, 2025
ప్రొద్దుటూరు: 8 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై కేసు నమోదు

ప్రొద్దుటూరు పోలీసులు బెట్టింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. తన బ్యాంక్ అకౌంట్లను బెట్టింగ్‌లకు ఉపయోగించారని జగన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రొద్దుటూరుకు చెందిన వీర శంకర్, చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవితేజ, పోరుమామిళ్ళ (M) నాయునిపల్లెకు చెందిన చంద్ర ఉన్నారు. ఈ కేసును 2 టౌన్ CI సదాశివయ్య దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
రేపు కడపకు రానున్న AR రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.
News November 4, 2025
కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.


