News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్‌గా అదితి సింగ్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్‌గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్‌ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
Similar News
News November 4, 2024
కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 9.30గం. నుంచి 10.30 గం. వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు 08562-244437 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పాలని తెలిపారు. అయితే నూతన కలెక్టర్‌గా శ్రీధర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
News November 3, 2024
కడప జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీధర్
కడప జిల్లా నూతన కలెక్టర్‌గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కలెక్టర్ శివశంకర్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన కలెక్టర్‌గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
News November 3, 2024
సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
సంబేపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనం ఢీకొని చెన్నకేశవ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చిపోయిన వ్యక్తి బద్వేల్ పెద్ద గోపవరం గ్రామానికి చెందిన కోడూరు చెన్నకేశవగా గుర్తించారు. తన వ్యక్తిగత పనుల మీద అన్నమయ్య జిల్లా పీలేరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.