News August 12, 2024
కడప: కుమార్తెను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో మృతి
పెనగలూరు మండలం ఇండ్లూరుకు చెందిన నరసింహులు తన కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈయన ఖతర్ వెళ్లి వారం క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అవ్వగారి ఇంటివద్ద ఉన్న కుమార్తెను చూసేందుకు చిన్న కుమారుడు రిషీతో కలిసి నెల్లూరుకుబైక్‌పై నరసింహులు బయలుదేరారు. ఓబులాయపల్లె వద్దకు రాగానే మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా రిషీకి గాయాలయ్యాయి.
Similar News
News September 13, 2024
స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం.. చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్
స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసి కడపను రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలు, పంచాయతీలతో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.
News September 12, 2024
కడప: విధులలో నిర్లక్ష్యం.. ఇద్దరు సస్పెన్షన్
కడప జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యవహారంపై జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. ప్రాధమిక విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ జి వెంకటేశ్వర్లు (హెచ్.సి 1379), కానిస్టేబుల్ సి.జి గంగాధర్ బాబు (పి.సి 563)లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 12, 2024
కడప పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం జిల్లా SP హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. శిక్షణా కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారో, సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీ వివరాలు DTC ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపల్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, జిమ్, తరగతి గదులను పరిశీలించారు.