News January 7, 2025

కడప: కులగణన అభ్యంతరాలకు నేడే చివరి రోజు

image

కుల గణనకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అభ్యంతరాల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి తెలిపారు. కులగణన అభ్యంతరాలు ఇంకా ఉండిఉంటే, తగిన ఆధారాలతో సచివాలయాలకు వెళ్లాలన్నారు. కాగా దీనికి సంబంధించిన తుది జాబితాను జనవరి 17న సచివాలయాల్లో ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.

Similar News

News December 8, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780

News December 8, 2025

కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.

News December 8, 2025

రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

image

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.