News March 24, 2024

కడప: కువైట్‌లో గుండాపురం వాసి మృతి

image

జిల్లాలోని బి.మఠం మండలం గుండాపురానికి చెందిన వ్యక్తి కువైట్‌లో మరణించాడు. గుండాపురానికి చెందిన బిజివేముల రామచంద్రారెడ్డి(47) బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. కాగా గతనెల 16న భవన నిర్మాణ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 21న మరణించాడు. ఆదివారం తన స్వగ్రామానికి బంధుమిత్రుల సహాయంతో మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News February 12, 2026

YVU దూరవిద్య సమాచారం కోసం ప్రత్యేక డొమైన్

image

YVU దూరవిద్య సంబంధిత సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ వైవీయూ వెబ్సైట్లో ప్రత్యేక డొమైన్‌ను VC ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. అనుబంధ దూరవిద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షల షెడ్యూల్ ఇలా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ పి.పద్మ, ప్రొ.కె.కృష్ణారెడ్డి, ప్రొ.తుమ్మలకుంట శివ, డా.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

News February 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.

News February 12, 2026

కడప: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

image

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.