News October 2, 2024
కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.
Similar News
News December 21, 2025
కడప జిల్లాలో పంటల సాగు ఇలా.!

కడప జిల్లాలో రబీలో పెద్దముడియం మండలంలో అత్యధికంగా 11580 హెక్టార్లలోను, ఒంటిమిట్టలో అత్యల్పంగా 12 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. VNపల్లె-8506, జమ్మలమడుగు-6248, ఎర్రగుంట్ల-5900, కమలాపురం-5555, సింహాద్రిపురం-5571, రాజుపాలెం-5226, కొండాపురం-4011, వల్లూరు-3651, ప్రొద్దుటూరు-2775, వేముల- 2730,
ముద్దనూరు-2081, పెండ్లిమర్రి-1714, వేంపల్లె-1645, కలసపాడు- 1154, తొండూరు-1088 హెక్టార్లలో పంటల సాగు జరిగింది.
News December 21, 2025
YS జగన్కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల.!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
News December 21, 2025
కడప: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కడప జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. కడపలోని 47వ డివిజన్లోని కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?


