News January 21, 2025

కడప కోటిరెడ్డి కాలేజీ అమ్మాయికి అరుదైన గౌరవం

image

ఈనెల 26వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడపకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ ఎస్.సుమియా ఎంపికైంది. కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఈమె బెటాలియన్ స్థాయి, తిరుపతి గ్రూప్ స్థాయిలతో పాటు ప్రీ రిపబ్లిక్‌డే వేడుకల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఢిల్లీలో నిర్వహించే పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఈమెకు లభించింది.

Similar News

News December 4, 2025

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.

News December 4, 2025

కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్‌లు ఉన్నాయి.

News December 4, 2025

ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

image

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.