News March 20, 2024

కడప: కోడ్ వచ్చినా.. కడపలో వీడని ఉత్కంఠ

image

ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.

Similar News

News January 7, 2026

కడప జిల్లాలో 18 మంది SIల బదిలీలు

image

కడప జిల్లాలో ఎస్సైలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 18 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలంటూ ఆయన ఆదేశించారు. ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో దాదాపు SIలకు స్థాన చలనం కల్పించారు.

News January 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.

News January 7, 2026

BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

image

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది.