News September 20, 2024
కడప: గంజాయి విక్రయాలపై దాడులు
కడపలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మాసాపేటలోని హిందూ స్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. వీరి వద్ద నుంచి 4.1 కేజీల గంజాయి, 1000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News October 5, 2024
మైదుకూరు: అవకతవకలపై 15 మందికి నోటీసులు
కడప జిల్లా మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారి సంజాయిషీలను సమర్పించాలని ఆదేశించినట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు.. రీ ఎంక్వయిరీ చేసి అక్కడ అవకతవకలు, తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్‌తోపాటు 14 మంది వీఆర్వోలకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.
News October 4, 2024
వైఎస్‌ఆర్ జిల్లా పేరు మార్చాలన్న మంత్రి.. దీనిపై మీ కామెంట్
వైఎస్సార్ జిల్లా పేరును మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. YCP ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్‌ఆర్ కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా చారిత్రక నేపథ్యం, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్..
News October 4, 2024
కడప: YCPకి మాజీ మంత్రి కుమారుడి రాజీనామా
జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీకి రాజీనామా చేశారు. ఇతను మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి స్వయానా పెదనాన్న కుమారుడు. ఈయన గడిచిన ఎన్నికల్లో కూడా వైసీపీ పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.