News June 12, 2024

కడప గడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

image

కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా జూన్ 30 నుంచి జులై 3వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -3 క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు జూన్ 30వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు 2 మ్యాచ్‌లు చొప్పున డే అండ్ నైట్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఉచితంగా మ్యాచులను వీక్షించవచ్చు అని తెలిపారు.

Similar News

News March 22, 2025

కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 22, 2025

కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

image

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.

News March 22, 2025

కడప: అయ్యో.. ఈమె కష్టం ఎవరికీ రాకూడదు

image

కడప జిల్లా ముద్దనూరు(M)లో ఓ మహిళ గాథ కన్నీటిని తెప్పిస్తోంది. మండలంలోని ఉప్పలూరుకు చెందిన గోవిందు శ్యామల భర్త లక్ష్మయ్యను ఏడాది క్రితం పాము కాటు వల్ల కోల్పోయింది. ఈమెకు ఇద్దరు ఆడ సంతానం. కుటుంబ పోషణ కోసం స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. శుక్రవారం తన చిన్న కుమార్తె కీర్తన(6) కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెను చూసిన గ్రామస్థులు అయ్యో దేవుడా ఎంతా పని చేశావని కన్నీటి పర్యంతం అయ్యారు.

error: Content is protected !!