News August 6, 2024
కడప: గణితశాస్త్రంలో మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్

గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News October 16, 2025
కడప: ఈ టేస్ట్ ఎక్కడా రాదండోయ్.!

కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ కాదండీ. నోరూరించే వంటకాలు కూడా మా సొంతం. ఇక్కడ రాగి సంగటి-నాటుకోడి ఫేమస్. అంతేకాందండోయ్.. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జి తింటే ఆహా అనాల్సిందే. ఇక చెన్నూరు బిర్యానీ, గువ్వల చెరువు పాలకోవ, జమ్మలమడుగులో దొరికే కుష్కాను ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. ఇక దోశపై కారం పట్టించి.. కాస్త పప్పుల పొడి వేసి తింటే నోరూరాల్సిందే. ఇక పొంగనాలు తినని కడప జిల్లా వాసి ఉండరు.
#ప్రపంచ ఆహార దినోత్సవం
News October 15, 2025
జమ్మూలో కడప జిల్లా జవాన్ మృతి.!

కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన BSF జవాన్ చపాటి నవీన్ (28) జమ్మూ కాశ్మీర్లోని బారాముల ప్రాంతంలో అకస్మికంగా మృతి చెందారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News October 15, 2025
మైదుకూరు: రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్

స్థానిక మైదుకూరులో రోడ్డు విస్తరణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విజ్ఞప్తి మేరకు కలెక్టర్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఇటీవల కొద్దిపాటి వర్షానికి మైదుకూరు రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ఆ ప్రాంతంలోని ఇల్లు దుకాణాల్లోకి నీరు ప్రవహించింది. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.