News August 6, 2024
కడప: గణితశాస్త్రంలో మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్
గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News September 11, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు వల్లూరు విద్యార్థినులు
వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
News September 10, 2024
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌కు ఎంపికైన IIIT విద్యార్థులు
కోనసీమలో ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు కడప జిల్లా తరఫున ఇడుపులపాయ IIIT విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం 7 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని ట్రిపుల్ఐటీ సంచాలకులు డా. కుమారస్వామి గుప్తా అభినందించారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ కోచ్ డా.బాల్ గోవింద్ తివారి తదితరులు పాల్గొన్నారు.
News September 10, 2024
YVUలో బీకాం ఆనర్స్ కోర్సు ప్రారంభం
కామర్స్ కోర్సు చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే ప్రభావంతంగా కోర్సు పూర్తి చేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి తెలిపారు. బీకాం ఆనర్స్ కోర్సును ఆచార్య కె.కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య ఎస్.రఘునాథ్‌రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మ, విభాగ అధిపతి ఆచార్య విజయభారతి పాల్గొన్నారు.