News April 24, 2025
కడప: ‘గర్భిణులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది’

గర్భిణులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని కడప ఐసీడీఎస్ పీడీ శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్ సభా భవనంలో కడప, అన్నమయ్య జిల్లాల ఐసీడీఎస్ అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృవందన పథకంలో గర్భం దాల్చిన 9నెలలలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు విడుతలగా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 25, 2025
కడప: మోదీ అంటే ఏంటో పాకిస్తాన్‌కి తెలుస్తుంది: ఎమ్మెల్యే

కడప జిల్లా యర్రగుంట్ల మండలంలో MLA ఆదినారాయణరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్థాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుందని ప్రపంచం మొత్తం బారత్‌కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి 3 కోట్లకు పైగా కశ్మీర్‌లో పర్యాటకులు సందర్శించారన్నారు. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్‌కు అంత ఉంటే 140 కోట్లు ఉన్న మనం ఏంటో ఆర్మీ శక్తి, ప్రధాని మోదీ అంటే ఏంటో పాకిస్థాన్‌కు తెలుస్తుందన్నారు.
News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని 4 IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
ఉమ్మడి కడప: ఒకేసారి తండ్రి, కూతురు పాస్

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.