News July 31, 2024
కడప: గెస్ట్ ఫ్యాకల్టీకి నేడు ఇంటర్వ్యూలు

కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు నేడు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సలీంబాషా తెలిపారు. MSC కంప్యూటర్సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ డేటా సైన్స్లోలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్/సెట్/స్లెట్, PHD అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌ను పూర్తి చేయాలి: కడప కలెక్టర్

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఈఆర్‌వోలను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 1963 కేంద్రాలకు అదనంగా 158 కొత్త కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, దీనితో మొత్తం 2121 కేంద్రాలు అవుతాయని తెలిపారు. ఒకే కుటుంబం సభ్యులు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.