News August 14, 2024

కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 19న ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. వి సలీం బాషా తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఎంఎస్సీ జువాలజీలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఏపీసెట్, నెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 10, 2025

పుష్పగిరి ఆలయంలో ఒకే పలకపై శివపార్వతి కుటుంబ విహార శిల్పం

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై ఉన్న అద్భుత కుడ్య శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేశ్ వివరించారు. ఈ శిల్పంలో శివపార్వతులు నందిపై, వారి కుమారులు వినాయకుడు (మూషికంపై), సుబ్రహ్మణ్య స్వామి (నెమలిపై) కుటుంబ సమేతంగా విహరిస్తున్నట్టు చిత్రీకరించారు. మకర తోరణం, అష్టదిక్పాలకులు కూడా ఈ శిల్పంలో చెక్కబడ్డాయి. ఇది ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక అని తెలిపారు.

News November 9, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్‌ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

image

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.