News October 20, 2024
కడప: గొర్రెల కాపరి ఆచూకీ లభ్యం.!
బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన <<14386467>>గొర్రెల కాపరి..<<>> గంగిరెడ్డి 6 రోజుల క్రితం అడవిలో మేకలకు వెళ్లి మిస్ అయ్యాడు. అతనికోసం ఓ పక్క డ్రోన్లతో మరో పక్క గ్రామస్థులు అడవిలో గాలించారు. కాగా శనివారం ఇతని ఆచూకీ లభ్యమైంది. అయితే లంకమల అభయారణ్యంలోని గుబ్బకోన వద్ద తిరుగుతుండగా వరికుంట గ్రామస్థులు గుర్తించారు. మేకల ఇంటికి రాలేదని వాటిని వెతుకుతూ అడవితో దారి మరచి తప్పిపోయినట్లు అతను తెలిపాడు.
Similar News
News January 22, 2025
శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు: డీఎస్పీ
కడపలో ఈరోజు ఉదయం అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముడి కళ్యాణం శోభాయాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప సబ్ డివిజన్ పరిధిలోని 9 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు ఎవరైనా పాల్పడిన ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు.
News January 21, 2025
కడప: వైవీయూలో పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ
యోగివేమన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాల కౌన్సెలింగు మంగళవారం ప్రాంగణంలోని ప్రవేశాల సంచాలకుల విభాగంలో ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగునకు వైఎస్సార్ అన్నమయ్య జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి, ప్రధానాచార్యులు ఎస్.రఘునాథరెడ్డి పర్యవేక్షించారు. డీవోఏ డైరక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.
News January 21, 2025
రాయచోటి: బాలికపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్టు
రాయచోటిలో పోక్సో కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. HIV నివారణ మందుల కోసం ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లిన బాలికను ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భిణి చేసి, నర్సు సహాయంతో అబార్షన్ చేయించాడు. ఇంట్లో విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు విజయ్ను అరెస్టు చేశారు.