News November 24, 2024

కడప: గోడౌన్‌లో చోరీ.. 8 మంది అరెస్ట్

image

కడపలోని రామాంజనేయపురం ఎరువుల గోడౌన్‌లో చోరీ చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు రిమ్స్ SI తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 20 రాత్రి ఎరువుల గోడౌన్ తాలాలు పగులగొట్టి ఎరువులు, రసాయనాలను చోరీ చేసినట్లు సమాచారం. గౌడోన్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ సీతారామిరెడ్డి ఆదేశాలతో 8 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారినుంచి లక్ష విలువైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News December 11, 2024

జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకూడదు: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్షను కలెక్టర్ నిర్వహించారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు.

News December 10, 2024

మరోసారి ఘాటెక్కిన కడప రాజకీయం

image

కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు MLA మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ MLA అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ‘రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం. ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా MLA నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది.

News December 10, 2024

కుందూ నదిలో పడి యువకుడు మృతి

image

కడప జిల్లా చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.