News August 21, 2024
కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్
కడపలో విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
Similar News
News September 13, 2024
పులివెందుల: ‘నా కుమారుడి ఆరోగ్యం బాగుంది’
తన కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందని వైఎస్ మధుసూధన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభిషేక్ తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని ప్రస్తుతం బాగుందని వెల్లడించారు.
News September 13, 2024
నిండుకుండలా గండికోట జలాశయం
గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24.85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం 11 గంటలకు మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు సమాచారం. అవుకు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2,990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
News September 13, 2024
ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే వరద
ఏపీలో ఇక YCPకి భవిష్యత్తు లేదని, జగన్ ఒక రాజకీయ అజ్ఞానిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని MLA వరదరాజులరెడ్డి విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే జగన్ బురద రాజకీయాలు చేయడం హేయమైన చర్యని అన్నారు. లక్షల కోట్ల అధిపతైన జగన్ వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు.