News March 6, 2025
కడప: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వైయస్సార్ కడప జిల్లా పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (58), వెంకట ఆంజనేయులు(55) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 12, 2026
ఖాజీపేట నిందితుడి కాలికి సర్జరీ.!

ఖాజీపేటలో శుక్రవారం మైనర్ బాలికను వెంకటేశ్ అనే యువకుడు గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి మోకాలి కింది భాగంలో ఎముక విరిగింది. కాగా దీనికి శనివారం కడప రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి ఎముకను సరిచేశారు.
News April 11, 2026
ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. వారిరువురు శనివారం ఇంటిలోని వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.