News September 5, 2024
కడప: చింతకుంటలో కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. ఉదయాన్నే పొలం దగ్గరకు రైతు మాను కొండు శివ కుంగిన భూమిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు. 2019లోనూ ఇదే భూమి కుంగిందని, అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ. 50 వేలు వెచ్చించినట్లు బాధిత రైతు తెలిపారు. అధికారులు దీనిని పరిశీలించాలని కోరుతున్నాడు.
Similar News
News September 9, 2024
కడప: ‘మా ఊరి సినిమా’ హీరో మహేశ్ ఇంట్లో భారీ చోరీ
పులివెందులలోని ‘మా ఊరి సినిమా’ చిత్ర హీరో మహేశ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీ ఖానా వెనక భాగంలో మహేశ్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 9, 2024
కడప జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.
News September 9, 2024
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ
కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో నేడు పోలీసులు బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. జిల్లా పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎస్పీ కార్యాలయానికి ఎవరూ రావొద్దని సూచించారు.