News July 1, 2024
కడప – చెన్నై ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2024
వేంపల్లె: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News November 10, 2024
ఇస్తాంబుల్ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.
News November 10, 2024
REWIND: సీపీ బ్రౌన్కు కడపతో ఉన్న అనుబంధం ఇదే.!
తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన భాషోద్యమ వీరుడు సీపీ బ్రౌన్. 10-11-1798లో కలకత్తాలో జన్మించారు. ఈస్ట్ ఇండియా తరఫున భారత్కు వచ్చి 1820లో కడపల డిప్యూటీ కలెక్టర్గా పని చేరారు. ఆ రోజుల్లో కడపలో ఇళ్లు కొనుక్కొని అక్కడే ఉన్నారు. తెలుగు నేర్చుకుని తెలుగు భాషా పరిశోధనకు కృషి చేశారు. అనేక తెలుగు గ్రంథాలను కూడా రాశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మన కడప జిల్లాతో సంబంధాలు ఉండటం గర్వంగా ఉందని పలువురు అన్నారు.