News November 16, 2024

కడప: ‘జగన్‌పై కోపంతో రాయలసీమకు అన్యాయం చేయొద్దు’

image

రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ నిర్మితమై ఉన్న సంస్థలను, అమరావతికి తరలించకుపోతూ, ఈ ప్రాంతాన్ని శ్మశానంగా చేస్తారా అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద కోపంతో రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయవద్దని, కరవు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోవడమే కాకుండా, ఉన్న న్యాయ సంస్థలు అమరావతికి తరలించడం ఏంటని నిలదీశారు. సీమకు అన్యాయం చేస్తుంటే ఊరుకోమన్నారు.

Similar News

News December 12, 2024

కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?

image

కడప : పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

News December 12, 2024

అన్నమయ్య: ఈ నెల 14న అన్ని పాఠశాలలకు సెలవు

image

డిసెంబర్ రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ప్రకటించారు. నీటి సంఘం ఎన్నికల దృష్ట్యా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సెలవు దినంగా ప్రకటించామని ఆయన తెలిపారు. గతంలో వర్షాల కారణంగా సెలవులు ఇచ్చినందుకు శనివారం వర్కింగ్‌డే‌గా ఉంటుందని ముందుగా ప్రకటించామని గుర్తుచేశారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి జరపాలని ఆదేశించారు.

News December 12, 2024

కడప: ‘ఈనెల 15 లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలి’

image

రైతులు ఈనెల 15వ తేదీ లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐతా నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె, బోడెద్దులపల్లెలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి ఈ నెల 31వ తేదీ వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఈశ్వర రెడ్డి పాల్గొన్నారు.