News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్కు ముందు వరుసలో ఉన్నారు.
Similar News
News March 30, 2025
పంచెకట్టులో కడప కలెక్టర్

కడప కలెక్టరేట్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఏడాదిలో అందరికి శుభం కలగాలని ప్రార్థించారు. పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.
News March 30, 2025
జిల్లాలో భారీగా సీఐల బదిలీలు

కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. కర్నూలు, కడప జిల్లాలో దాదాపు 16 మంది సీఐలను బదిలీ చేశారు. ఇందులో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగా మరికొంతమంది సీఐలను విఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
News March 30, 2025
రామయ్య కల్యాణానికి CMకు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాములోరి కళ్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కల్యాణోత్సవానికి రావాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఆదివారం వారు తాడేపల్లిలోని CM క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.