News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్‌కు ముందు వరుసలో ఉన్నారు.
Similar News
News April 19, 2025
ఘోర ప్రమాదం.. కడప ప్రయాణికులు సేఫ్

కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.
News April 18, 2025
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.
News April 18, 2025
కడప – రాయచోటి రోడ్డుపై యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

రామాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా కడప – రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగం రెడ్డి మృతిచెందారు. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.