News May 18, 2024
కడప, జమ్మలమడుగుపై ప్రత్యేక నిఘా

కడప జిల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేసింది. దీనిలో భాగంగానే సుధీర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేశ్ రెడ్డి ఊర్లో ఉండొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో వారు బయటి ప్రాంతాలకు వెళ్లారు. అటు కడపలో కూడా జరిగిన గొడవపై అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మాధవిరెడ్డి, వాసు హైదరాబాద్ వెళ్లారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Similar News
News November 28, 2025
అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
News November 28, 2025
కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.
News November 28, 2025
కడప: హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరు..?

జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ.కోట్ల విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటి వరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుని జీతాలు నిలిపేశారు. సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఐతే రూ.కోట్లు కొల్లగొట్టిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


