News October 17, 2024
కడప జిల్లాకు అదొక పీడకల

కడప నగర ప్రజలకు 2001 అక్టోబర్‌లో వచ్చిన వరదలు ఓ పీడకలను మిగిలిచ్చింది. కడప బుగ్గ వంకకు భారీగా వరద రావడంతో కడప నగరాన్ని చుట్టుముట్టింది. తెల్లవారు జామున నిద్రలేచి తేరుకునేలోపు పలువురు శవాలుగా మారారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లల్ని భుజాన వేసుకొని రోడ్ల మీద పరుగులు తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూస్తుంటే అక్కడి ప్రజలు ఆ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News November 28, 2025
కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.
News November 28, 2025
కడప: హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరు..?

జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ.కోట్ల విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటి వరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుని జీతాలు నిలిపేశారు. సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఐతే రూ.కోట్లు కొల్లగొట్టిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News November 28, 2025
ఎన్నికల వేళ రౌడీషీటర్లపై కన్నేయండి: జిల్లా ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరు మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.


