News November 16, 2024
కడప జిల్లాకు వైఎస్ షర్మిల రాక

ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన ఖరారైందని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ రాజా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ.. 19వ తేదీ మంగళవారం కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. 20న ఇడుపులపాయ నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News November 21, 2025
కడప కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
News November 21, 2025
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News November 21, 2025
ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.


