News November 16, 2024

కడప జిల్లాకు వైఎస్ షర్మిల రాక

image

ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన ఖరారైందని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ రాజా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ.. 19వ తేదీ మంగళవారం కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. 20న ఇడుపులపాయ నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారన్నారు.

Similar News

News March 16, 2026

రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

image

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.

YVUలో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

image

YVUలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 19వ తేదీ లోపు APPGCET -2026కు
దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అడ్మీషన్స్ డైరెక్టర్ డా. లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ పూర్తయిన వారు, చివరి సెమిస్టర్ పరీక్షలు రాయబోయే వారు https://cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించాలన్నారు.