News December 4, 2024

కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం

image

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News January 21, 2025

కడప: వైవీయూలో పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ

image

యోగివేమన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాల కౌన్సెలింగు మంగళవారం ప్రాంగణంలోని ప్రవేశాల సంచాలకుల విభాగంలో ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగునకు వైఎస్సార్ అన్నమయ్య జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి, ప్రధానాచార్యులు ఎస్.రఘునాథరెడ్డి పర్యవేక్షించారు. డీవోఏ డైరక్టర్‌ డా. లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.

News January 21, 2025

రాయచోటి: బాలికపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్టు

image

రాయచోటిలో పోక్సో కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. HIV నివారణ మందుల కోసం ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లిన బాలికను ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భిణి చేసి, నర్సు సహాయంతో అబార్షన్ చేయించాడు. ఇంట్లో విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు విజయ్‌ను అరెస్టు చేశారు.

News January 21, 2025

సిద్దవటం: కిడ్నీ వ్యాధితో ఏడేళ్ల బాలుడి మృతి

image

కడప జిల్లా సిద్దవటం మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన రాజు, రామతులసి దంపతుల కుమారుడు మహేంద్రవర్మ(7) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రామక్రిష్ణాపురానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ఎంపీపీ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నేటి ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.