News April 2, 2025
కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

కడప జిల్లా వ్యాప్తంగా ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 16 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 12 మంది సీఐలను బదిలీ చేయగా తాజాగా 16 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 23, 2026
28న వైవీయూ హ్యాండ్ బాల్ జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్

యోగి వేమన యూనివర్శిటీ హ్యండ్ బాల్ స్త్రీ, పురుషుల జట్ల కోసం డైరెక్ట్ సెలక్షన్ ట్రయల్స్ విశ్వవిద్యాలయ వేమన క్రీడా ప్రాంగణంలో ఈ నెల 28 వతేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు సెక్రటరి డా. రామ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైవీయూ అనుబంధ సంస్థలలో చదువుతూ ఉండాలన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలన్నారు. వివరాలకు 6281689398 నంబరును సంప్రదించాలన్నారు.
News February 23, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
News February 23, 2026
పులివెందులకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న పర్యటించే షెడ్యూల్ను వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 10:30కి వేంపల్లి మండలం నంది పల్లె నందీశ్వర ఆలయానికి చేరుకుంటారు. తిరిగి 11:30కి అక్కడి నుంచి బయలుదేరి 12:30కి బాకరాపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 నుంచి 6: 25 వరకు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 6:30కి ఇంటికి చేరుకొని అక్కడే బసచేస్తారు.


