News September 6, 2024
కడప జిల్లాలో కుంగిన భూమి.. కారణమిదే.!
వైవీయూ జియాలజీ, ఎర్త్ సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు దువ్వూరు మండలం రామాపురం వ్యవసాయ భూమిని సందర్శించారు. రైతు మానుకొండ వెంకట శివ వ్యవసాయ భూమిలో 15 అడుగుల లోతు మేర కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జియాలజీ శాఖ సహ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. సున్నపురాతి పొరలు భూగర్భంలో జరిపిన చర్య ఫలితంగా భూమి కుంగిందన్నారు.
Similar News
News January 9, 2025
కడప: హత్య కేసులో ఐదుగురికి శిక్ష
తొర్రివేములకు చెందిన కుమ్మరి గురు ప్రసాద్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురువారం కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. హతుడి భార్య ప్రమీలకు తీట్ల సురేశ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. వారి బంధానికి భర్త అడ్డంకిగా మారడంతో మరో ముగ్గురితో కలిసి ప్రసాద్ను హత్య చేశారు. కేసును విచారించిన 2nd ADJ కోర్ట్ జడ్జి G. S రమేశ్ కుమార్ వారికి జీవిత ఖైదు విధించారు.
News January 8, 2025
పుల్లంపేటలోని శ్రీ సంజీవరాయస్వామికి పొంగళ్లు
పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
News January 8, 2025
కడప జిల్లాలో నేడు ప్రధాని ప్రారంభించేవి ఇవే
ప్రధాని మోదీ నేడు వర్చువల్గా కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ. 135 కోట్లతో మైదుకూరు – ముదిరెడ్డిపల్లె 2 లైన్ల రోడ్డు విస్తరణ, రూ. 1.321 కోట్లతో వేంపల్లి – చాగలమర్రి 2/4 వరుసల విస్తరణ పనులు చేపట్టనున్నారు. తమ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.