News August 27, 2024
కడప జిల్లాలో చట్టబద్ధంగా ఇసుక సరఫరా.!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.
Similar News
News November 21, 2025
ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.
News November 21, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.


